కొడిమ్యాల, అక్టోబర్ 13(నవగీతం) :
సమగ్ర శిక్ష ఉద్యోగులకు సీఎం హామీ ఇచ్చి మూడేళ్లు పూర్తి కావస్తున్నా అమలుకు నోచుకోవడంలేదని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్టులో విధులు నిర్వర్తిస్తున్న సుమారు 20 వేల మంది తాత్కాలిక ఉద్యోగులు(ఆ)గౌరవ వేతనాలు సరిపోక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.సమస్యల పరిష్కారం కోసం సమ్మెలు చేసినా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. దినదినం ధరలు పెరుగుతున్నాయి గానీ వేతనాలు పెరగడం లేదని, 15 ఏండ్ల నుండి వెట్టిచాకిరీ జీవితాలు గడుపుతున్నామని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ ఉద్యోగులకు ఇచ్చిన హామీమేరకు మాట నిలబెట్టుకొని వీరి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతున్నారు.

