Tuesday, November 3, 2026
ads
Homeతెలంగాణజిల్లా కలెక్టర్‌ను కలిసిన కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్

జిల్లా కలెక్టర్‌ను కలిసిన కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్

📰 Generate e-Paper Clip

నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేపట్టాలని వినతి

జగిత్యాల,అక్టోబర్13,( నవగీతం ప్రతినిధి):

జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్‌ను కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ మర్యాదపూర్వకంగా కలిసి, నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులకు సంబంధించిన వినతులను వివరించారు. ఆయా గ్రామాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నిధులు కేటాయించి, అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారు.

చెర్లకొండపూర్ గ్రామం: మెట్‌పల్లి మండలంలోని చెర్లకొండపూర్ గ్రామంలో ఉన్న ఎంపీపీఎస్ పాఠశాలకు కిచెన్ షెడ్ నిర్మించాలని కోరారు.

పెద్దాపూర్ గ్రామం: మెట్‌పల్లి మండలంలోని పెద్దాపూర్ గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

సంగెం గ్రామం: కోరుట్ల మండలంలోని సంగెం గ్రామంలో ప్రజల రాకపోకలకు సౌకర్యంగా కల్వర్టు నిర్మాణం చేపట్టాలని కోరారు.

నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధికి, ప్రజల అవసరాలను తీర్చేందుకు ప్రాధాన్యతనిస్తూ ఆయా పనులను చేపట్టాలని ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular