Tuesday, November 3, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలపువ్వులను పూజించడం తెలంగాణ గొప్ప సంస్కృతి : ఎస్పీ అశోక్ కుమార్

పువ్వులను పూజించడం తెలంగాణ గొప్ప సంస్కృతి : ఎస్పీ అశోక్ కుమార్

📰 Generate e-Paper Clip

జిల్లా ప్రజలకు, పోలీస్ కుటుంబ సభ్యులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు

జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు.

జగిత్యాల, అక్టోబర్18,(నవగీతం)

తెలంగాణ సంస్కృతి,సాంప్రదాయాలకు అద్దంపట్టే బతుకమ్మ వేడుకలు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆట పాటలు, కోలాటాలతో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. ఈ యొక్క కార్యక్రమానికి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  హాజరై వేడుకలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ… బతుకమ్మ పండుగ తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే పండుగ అని ఇలాంటి వేడుకలు సాంప్రదాయ విలువలను కాపాడటమే కాకుండా, కుటుంబ బంధాలను మరింత బలపరుస్తాయి అని అన్నారు.ఎక్కడైనా దేవుళ్లకు పూలు పెట్టి కొలుస్తాము, కానీ పువ్వులనే దేవతగా కొలిచే సాంప్రదాయం ఒక తెలంగాణ లో మాత్రమే ఉందన్నారు. తెలంగాణ సంస్కృతికి చారిత్రక చిహ్నం బతకమ్మని మరియు తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతున్నాయి తెలిపారు. పోలీసు వారి కుటుంబ సభ్యులతో బతుకమ్మ ఆడటం ఇంత మంది కుటుంబ సభ్యులను కలిసినందుకు వారితో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నందుకు ఆనందంగా ఉందని అన్నారు.

ఈ సందర్బంగా ఎస్పీ పోలీసు సిబ్బంది,వారి కుటుంబ సభ్యులతో కలిసి బతుకమ్మ ఆడుతూ సాంప్రదాయ ఉత్సాహాన్ని పంచుకున్నారు. మహిళా పోలీస్ సిబ్బంది అందరూ రంగురంగుల చీరలతో బతుకమ్మలను అలంకరించి పాటలు పాడుతూ ఆనందోత్సాహాలతో వేడుకను జరిపారు.అలాగే అందంగా, సాంప్రదాయ శైలిలో బతుకమ్మలను రూపొందించిన వారికి ప్రత్యేక బహుమతులను ప్రదానం చేసి సత్కరించారు.

ఈ కార్యక్రమంలో డిఎస్పీ పురుషోత్తం రెడ్డి,ఇన్స్పెక్టర్లు మరియు ఎస్.ఐ లు మహిళా సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular