Monday, November 2, 2026
ads
Homeతెలంగాణఈ-వ్యర్థాల నిర్వహణపై విద్యార్థుల అవగాహన ర్యాలీ

ఈ-వ్యర్థాల నిర్వహణపై విద్యార్థుల అవగాహన ర్యాలీ

📰 Generate e-Paper Clip

మల్లాపూర్,అక్టోబర్28, (నవగీతం): పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎలక్ట్రానిక్ వ్యర్థాల నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మల్లాపూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు బుధవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

పాఠశాల విద్యాశాఖ, ఎకో క్లబ్ ఫర్ మిషన్ లైఫ్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి గ్రామంలో ర్యాలీ చేపట్టారు. ఈ-వ్యర్థాల వల్ల కలిగే అనర్థాలు, వాటి సరైన నిర్వహణపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం స్థానిక బస్టాండ్‌లో ప్రజల సమక్షంలో విద్యార్థులు మానవహారం నిర్వహించారు.

ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన నాటిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సక్రమంగా సేకరించకుండా, నిర్వహించకుండా నిర్లక్ష్యంగా బయట పారవేయడం లేదా కాల్చడం వల్ల పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి కలిగే ప్రమాదాలను నాటిక ద్వారా చక్కగా వివరించారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పారవేయడం, కాల్చడం వల్ల పర్యావరణ కాలుష్యం పెరిగి అనేక సమస్యలు తలెత్తుతాయని తెలిపారు. ఈ-వ్యర్థాలను బాధ్యతాయుతంగా సేకరించి, సరైన పద్ధతిలో నిర్వహించాలని విద్యార్థులకు, గ్రామ ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు సేకరించిన ఎలక్ట్రానిక్ వ్యర్థాలను పాఠశాలలో భద్రపరిచారు.

ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు చంద్రమోహన్ రెడ్డితో పాటు ఉపాధ్యాయులు భాస్కర్, సురేష్, నరసయ్య, సౌజన్య, రమేష్, సాజిద్, విష్ణు, దివ్య, ప్రవీణ్, విక్రమ్, గ్రామస్తులు వెంకటేశ్వర్లు, ఖాజా తదితరులు పాల్గొన్నారు.

.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular