నవగీతం, జగిత్యాల
దేశంలో ప్రత్యేకమైన, గొప్ప వృత్తి నైపుణ్యాన్ని కలిగిన ఘనత కేవలం పద్మశాలీకే ఉందని జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గజేంగి నందయ్య, జగిత్యాల తాజా మాజీ మున్సిపల్ ఛైర్పెర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ కొనియాడారు. ఆదివారం జగిత్యాల జిల్లా మాల్యల మండల కేంద్రంలో నిర్వహించిన పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశంలో నూతనంగా ఎన్నికైన పద్మశాలి సర్పంచ్ లను, వార్డు మెంబర్లను సన్మానించి నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ పద్మశాలీలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని కోరారు. పద్మశాలీలు సంఘటితమై ఐకమత్యంతో మెదిలి తమ గౌరవాన్ని, ప్రతిష్టతను పెంచుకోవాలని సూచించారు. చట్ట సభలకు ప్రాతినిథ్యం వహించినప్పుడు మాత్రమే తమ న్యాయమైన కోర్కెలు సాధించుకోగలుగుతామన్నరు. పార్టీలకతీతంగా చట్టసభలకు పద్మశాలీ బిడ్డలను పంపించుకోవాల్సిన అవశ్యకతను గుర్తించుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో మాల్యల సర్పంచ్ బొట్ల జయ ప్రసాద్, రాష్ట్ర పద్మశాలి నాయకులు బోగ వెంకటేశ్వర్లు, మాల్యల మండల అధ్యక్షుడు ముల్క మల్లయ్య, పద్మశాలి సేవా సంఘం అధ్యక్ష, కార్యవర్గ సభ్యులు, కుల బంధువులు, నాయకులు పాల్గొన్నారు

