నవగీతం,ధర్మపురి:
బుగ్గారం మాజీ జడ్పీటీసీ బాదినేని రాజేందర్ తండ్రి ఇటీవల మరణిచగా,సోమవారం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ వారి కుటుంబాన్ని పరామర్శిం చారు.మండల కేంద్రంలోని రాజేందర్ నివాసానికి చేరుకున్న ఎంపీ ఆయన తండ్రి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళుల ర్పించారు.అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి తన ప్రగాఢ సాను భూతిని తెలియజేశారు.ఈ కష్ట సమయంలో కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్ర మంలో ఎంపీ వెంట స్థానిక ప్రజాప్రతి నిధులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, ముఖ్య నాయకులు,కార్యక ర్తలు పాల్గొన్నారు.

