నవగీతం, మల్లాపూర్
భారతీయ జనతా పార్టీ మండల ప్రధాన కార్యదర్శిగా వేంపల్లి గ్రామానికి చెందిన గోపినేని రాజేందర్ యాదవ్ నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మండల అధ్య క్షుడు గోపిడి శ్రీనివాస్ రెడ్డి నియామక పత్రాన్ని అందజేశారు.వారు పార్టీ పరిష్ట తకు కష్టపడి పని చేయాలని సూచించారు. తనపై నమ్మకం ఉంచి మండల ప్రధాన కా ర్యదర్శిగా నియమించినందుకు మండల బిజెపి నాయకులకు రాజేందర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేంపల్లి గ్రామ సర్పంచ్ గుగ్లావత్ రాజేందర్, జిల్లా ఉపాధ్యక్షురాలు ఎర్ర లక్ష్మి, మండల మహిళ అధ్యక్షురాలు సత్తమ్మ, దివాకర్ రెడ్డి, రాజు యాదవ్, శేఖర్ తదితరులు ఉన్నారు.

