Thursday, February 26, 2026
ads
Homeజిల్లా వార్తలుజగిత్యాలబీసీలకు బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలి- తాసిల్దార్ కు వినతి

బీసీలకు బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలి- తాసిల్దార్ కు వినతి

📰 Generate e-Paper Clip


నవగీతం, గంగాధర


గంగాధర మండల తెలంగాణ రాజ్యాధికారం పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు తహసీల్దార్ అంబటి రజితకు వినతి పత్రం తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల సంక్షేమానికి బీసీ సబ్ ప్లాన్‌ను చట్టబద్ధంగా అమలు చేయాలని తెలంగాణ రాజ్యాధికారం పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు పార్టీ నాయకులు, గంగాధర మండల తహసీల్దార్ అంబటి రజితకు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి వెనుకబడిన తరగతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.11,405.31 కోట్ల బడ్జెట్ కేటాయించగా, ఇప్పటివరకు కేవలం రూ.2,426.20 కోట్లను మాత్రమే ఖర్చు చేసినట్లు తెలిపారు. బీసీ సబ్ ప్లాన్ అమలులో ఉంటే కేటాయించిన నిధులు పూర్తిగా ఖర్చయ్యే అవకాశం ఉండేదని, ప్రస్తుతం బీసీలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.అందుకే వెంటనే బీసీ సబ్ ప్లాన్ చట్టం చేసి అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఈ వినతి పత్రం అందజేశామని తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికారం పార్టీ నాయకులు కొప్పుల వెంకటేష్, గంగాధర మండల అధ్యక్షుడు ముక్కెర గంగరాజు, మహిళా అధ్యక్షురాలు నాగారపు పల్లవి, ఒగ్గు శ్రీనివాస్, వందనాల ఆంజనేయులు, ముక్కెర పరశురామ్, పలుమారు సాగర్, బోయినపల్లి మండల నాయకులు కొంకటి శ్రీధర్, పొత్తూరి సుభాష్, సోషల్ మీడియా జగిత్యాల జిల్లా కన్వీనర్ బూత్కూరి మధు, గంగాధర మండల సోషల్ మీడియా కన్వీనర్ గుండ సతీష్, బీసీ నాయకులు మడ్లపెల్లి శ్రీనివాస్, బండారి మల్లేశం, శివరాత్రి రజినీ కుమార్, వైద భరత్, జడ మల్లయ్య, నాగుల నారాయణ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular