Thursday, September 24, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలురాష్ట్రస్థాయి పిఎం ఎస్ఆర్ఐ క్రీడా పోటీలకు రుద్రంగి విద్యార్థుల ఎంపిక

రాష్ట్రస్థాయి పిఎం ఎస్ఆర్ఐ క్రీడా పోటీలకు రుద్రంగి విద్యార్థుల ఎంపిక

📰 Generate e-Paper Clip

వగీతం, రుద్రంగి

గత రెండు రోజులుగా సిరిసిల్ల పట్టణంలో జరిగిన జిల్లా స్థాయి పిఎం, ఎస్ఆర్ఐ క్రీడా పోటీలలో రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల కు చెందిన మానషా లాంగ్ జంప్ లో ప్రథమ స్థానం, థామష్ 100 మీటర్ల పరుగు పందెంలో ప్రథమ స్థానం, పరమేష్ అనే విద్యార్థులు లాంగ్ జంప్ లో ద్వితీయ స్థానంలో ముగ్గురు విద్యార్థులు గెలుపొందారు. కాగా అట్టి విద్యార్థులను రాష్ట్రస్థాయి పిఎం, ఎస్ఆర్ఐ క్రీడా పోటిలకు ఎంపికయ్యారు. రాష్ట్రస్థాయి క్రీడలకు ఎంపిక కావడం పట్ల స్థానిక సర్పంచ్ గండి నారాయణ, ప్రభుత్వ పాఠశాల ప్రదానోపద్యాయుడు సమ్మిరెడ్డి, ఫిజికల్ డైరక్టర్ హన్మంతు ఉపాద్యాయులు సతీష్, గడప వేణు లు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular