నవగీతం,మల్లాపూర్
మల్లాపూర్ మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆదివారం శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ముగ్గుల పోటీలను నిర్వహించినారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ముందస్తుగా నిర్వహించిన ముగ్గుల పోటీలలో ప్రథమ బహుమతి చింత కవిత, ద్వితీయ బహుమతి కస్తూరి లాస్య వీరు ఇరువురు విజేతలుగా నిర్ణయించబడ్డారు వీరికి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు సోమ అశ్విన్ కుమార్ ప్రథమ ద్వితీయ బహుమతులను అందజేసినారు. ఈ కార్యక్రమానికి కోశాధికారి నూనె శ్రీనివాస్, కార్యదర్శి చింత శశిధర్, మండల ఆర్యవైశ్య సంఘం మహిళా విభాగం అధ్యక్షురాలు కస్తూరి స్వప్న, కార్యదర్శి గాదే లిఖిత, కోశాధికారి పడగల ఆమని, శివరామ కిషన్ గుప్తా, కంటాల రాజన్న, ర్యాగల్ల వెంకటేశ్వర్లు, నూనె అంజనేయులు, కస్తూరి సంతోష్, కస్తూరి రాంప్రసాద్ పడిగెల నాగేంద్రబాబు, కంటాల మహేష్ తో పాటు మండల ఆర్యవైశ్య సంఘ సభ్యులు మరియు మహిళా విభాగం సభ్యురాలు పాల్గొన్నారు.

