Thursday, February 26, 2026
ads
Homeజిల్లా వార్తలుజగిత్యాల7వ వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అవకాశం  ఇవ్వండి.

7వ వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అవకాశం  ఇవ్వండి.

📰 Generate e-Paper Clip

నవగీతం,మెట్ పల్లి

మెట్ పల్లి పట్టణంలోని 7వ వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అవకాశం కల్పించాలని కోరుతూ 7వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ అబ్దుల్ జాకీర్ కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ జువ్వాడ నర్సింగరావు , కొమిరెడ్డి విజయ్ ఆజాద్ మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.పార్టీ తరపున రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆశాభావంతో అబ్దుల్ జాకీర్ తన అభ్యర్థిత్వంపై దరఖాస్తు చేశారు. ఈ సందర్భంగా ఆయన తన కుటుంబ రాజకీయ నేపథ్యాన్ని వివరిస్తూ తన తండ్రి గత 45 సంవత్సరాలుగా మెట్ పల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కి సేవలందించారని తెలిపారు. తాను కూడా గత మూడు సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని అనుభవం కలిగి ఉన్నానని 7వ వార్డు ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అబ్దుల్ జాకీర్ పేర్కొన్నారు.పార్టీ అధిష్టానం తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించి అవకాశం కల్పిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular