Friday, April 17, 2026
ads
Homeజిల్లా వార్తలుజగిత్యాలవెంకటేశ్వర స్వామి కళ్యాణంలో పాల్గొన్న ఎమ్మెల్యే

వెంకటేశ్వర స్వామి కళ్యాణంలో పాల్గొన్న ఎమ్మెల్యే

📰 Generate e-Paper Clip

నవగీతం, మెట్ పల్లి

మెట్ పల్లి పట్టణం లోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో గోదాదేవి-రంగనాథుల కల్యాణం లో జగిత్యాల జిల్లా బీఆర్ఏస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు దంపతులు పాల్గొన్నారు. అలాగే మల్లాపూర్ మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గోదాదేవి- రంగనాథుల కళ్యాణం లో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పాల్గొన్నారు. దేవాదాయ కమిటీ సభ్యులు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు తీర్థ ప్రసాదాలు అందజేసి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మల్లాపూర్ సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్, సంఘ రాజన్న, దేవా మల్లయ్య ముద్ధం శరత్ గౌడ్ ,జీవన్ రెడ్డి, తుక్కారం, కుంట రాజు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular