నవగీతం,వెల్గటూర్
నూతనంగా వెల్గటూర్ మండల ఉప సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులు గా ఎన్నికైన గండ్ర ప్రతాప్ రావు బుధవారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ధర్మపురి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ని మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్బంగా నూతనంగా ఎన్నికైన ఉప సర్పంచ్ ల ఫోరమ్ మండల అధ్యక్షులు గండ్ర ప్రతాప్ రావు ను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మెరుగు మురళీ గౌడ్,కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ గండ్ర శ్రీకాంత్ రావు, బి సి సెల్ మండల అధ్యక్షులు బందెల ఉదయ్ గౌడ్,మాజీ ఉప సర్పంచ్ గుండాటి సందీప్ రెడ్ది, మార్కెట్ కమిటీ డైరెక్టర్ జూపాక ప్రవీణ్, కస్తూరి తిరుమల్లేష్, గుమ్ముల లక్ష్మణ్, సూర స్వామి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

