ముగ్గుల పోటీలు విజేతలకు బహుమతులు ప్రధానం
నవగీతం జగిత్యాల
తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలకు సంక్రాంతి పండుగ ప్రతీక అని తాజా మాజీ మున్సిపల్ ఛైర్పెర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో సుమన్ టీవీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. అనంతరం గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రధానం చేసి ఆమె మాట్లాడుతూ సంస్కృతిని ప్రేమిస్తూ ముందు తరాలకు అందించడం మనందరి బాధ్యత అన్నారు. సంక్రాంతి పండుగను మరింత అందంగా మలిచేది ముగ్గులేనని అన్నారు.ఈ కార్యక్రమంలో జువ్వడి కృష్ణారావు, ఇందూరు సత్యం , మచ్చ కవిత ఐలాపూర్ సత్యం, దాసరి లావణ్య ప్రవీణ్, సుమన్ టీవీ మోహన్, జిల్లా ఇంచార్జి, సుమన్ టీవీ నియోజవర్గ ఇంచార్జ్ కిరణ్ సింగ్ , బెజ్జారాఫ్ శ్రీనివాస్, ముఖ్య నాయకులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని వివిధ రకాల ముగ్గులు వేసి అందరిని ఆకట్టుకున్నారు.

