Thursday, April 16, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలురేపాక కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా గూడ బాబు.

రేపాక కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా గూడ బాబు.

📰 Generate e-Paper Clip

నవగీతం,ఇల్లంతకుంట

ఇల్లంతకుంట మండలంలోని రేపాక గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా గూడ బాబు నియమిస్తున్నట్లు నియామక పత్రాన్ని బాబుకు మండల అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా గూడ బాబు మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి మాజీ ఎంపీపీలు రమణారెడ్డి, ఐలయ్య యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను నెరవేరుస్తానని పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో రేపు ఒక సర్పంచ్ కాత మల్లేశం, ఉప సర్పంచ్ మహేష్ లింగంపల్లి, శేఖర్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular