నవగీతం,తిరుపతి
నందవరం మండల పరిధిలోని జడ్పీహెచ్ స్కూల్ నాగలదిన్నెలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న బాలబంధు గద్వాల సోమన్న విరచిత “మట్టి పరిమళం” పుస్తకావిష్కరణ పిల్లల ప్రపంచం, సైన్స్ సెంటర్ తిరుపతిలో సాహితీ సంక్రాంతి బాలానందం – బాల సాహితోత్సవం సందర్బంగా ఘనంగా జరిగాయి.ఈ సభకు వక్తగా వెళ్లిన కవి సోమన్న తన పుస్తకాలను అవధాని ఆముదాల మురళి,సభాధ్యక్షలు డా. కిట్టన్న, కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత గంగిశెట్టి శివకుమార్,యువశ్రీ మురళీ, విద్వాన్ గోవిందయ్య, కళాపోషకులు ఏ. ఎల్. కృష్ణారెడ్డి, పిళ్ళై చంద్రశేఖర్ మరియు విచ్చేసిన ప్రముఖుల చేతుల మీద ఆవిష్కరణలు జరిగించడం గమనార్హం.ఈ కార్యక్రమంలో సినీ గేయ రచయిత పెంచల్ దాస్, గరిమెళ్ల అశోక్, ఆర్. సి.కృష్ణస్వామిరాజు,పుల్లా రామాంజనేయులు,చక్రపాణి మరియు అతిరథ మహారథుల.. పాల్గొన్నారు. అనంతరం బహు గ్రంథకర్త, వక్త, బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్నను సత్కరించారు.

