పలు గ్రామాల్లో వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన టిడిపి కార్యకర్తలు
నవగీతం,వైరా:
వైరా నియోజకవర్గ కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న వైరా మండల టిడిపి కార్యకర్తలు మండలంలో ఉన్నటువంటి టిడిపి అన్ని గ్రామాల పార్టీ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో ఉన్నారు. అలాగే మండలంలోని పుణ్యపురం గ్రామంలో టిడిపి కార్యకర్తలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ జెండా దిమ్మెకు రంగులు వేయించి టిడిపి జెండాను ఆవిష్కరించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ టిడిపి అధ్యక్షులు, గ్రామ ఉప సర్పంచ్ గ్రామ కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

