నవగీతం,జగిత్యాల
రాయికల్ పట్టణానికి చెందిన సామల్ల సంజీవ్ జీర్ణ సంబంధిత వ్యాధి తో బాధపడుతూ వైద్యం చేసుకునే ఆర్థిక స్తోమత లేని పరిస్థితుల్లో రాయికల్ మాజీ వైస్ చైర్మన్ గండ్ర రమాదేవి అచ్యుత రావు జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ దృష్టికి తీసుకురాగా నిమ్స్ లో చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.2 లక్షల ఎల్ఓసిని వారి కుటుంబ సభ్యులకు జగిత్యాల పార్టీ కార్యాలయంలో ఆదివారం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అందజేశారు. వారి వెంట నాయకులు గట్టు సతీష్ క్యాదసు నాగయ్య ముస్కు నారాయణ రెడ్డి అజారీ వినోద్ రాజేష్ తదితరులు ఉన్నారు.

