Thursday, April 16, 2026
ads
Homeజిల్లా వార్తలుజగిత్యాలఅభివృద్ధి తో పాటు సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి. ఎమ్మెల్యే

అభివృద్ధి తో పాటు సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి. ఎమ్మెల్యే

📰 Generate e-Paper Clip

నవగీతం,జగిత్యాల

జగిత్యాల పట్టణ మోతే రోడ్డు పార్టీ కార్యాలయంలో జగిత్యాల పట్టణానికి చెందిన 134 మంది ఆడ బిడ్డలకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకం ద్వారా మంజూరైన రూ.1 కోటి 34 లక్షల విలువగల చెక్కులను లబ్ధిదారులకు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ జగిత్యాల పట్టణంలో ప్రతి వార్డులో అభివృద్ధి జరుగుతున్నాయి.తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి తో పాటు సంక్షేమం పథకాలు అమలు అవుతున్నాయి. పట్టణంలో త్వరలో 50పడకల ఆసుపత్రి ప్రారంభోత్సవం కానుంది. 204 కోట్ల తో నూతన ఆసుపత్రి నిర్మాణానికి భూమిపూజ రాష్ట్ర సర్కార్ విద్య వైద్యం పై ప్రత్యేక దృష్టి సారించింది,5 కోట్ల తో మహిళ డిగ్రీ కళాశాల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. జిల్లా కేంద్రంలో అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ మంజూరు తో వృత్తి విద్యా విద్యార్థులకు చాలా ఉపయోగం ఉంటుంది.పట్టణంలో నీటి కొరతకు నూతన ట్యాంక్ ల నిర్మాణం చేపట్టడం జరిగింది.ముఖ్యమంత్రి చొరవతో జగిత్యాలకు 62.5 కోట్ల నిధులు మంజూరు కాగా మౌలిక సదుపాయాలు కల్పన కి కృషి చేస్తాం వచ్చే నెల నుండి పనులు ప్రారంభం కానున్నాయని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో రామ్మోహన్, పట్టణ నాయకులు గిరి నాగభూషణం ,అడువల జ్యోతి లక్ష్మణ్,గట్టు సతీష్,దామోదర్ రావు,చెట్పల్లి సుధాకర్, క్యాదసు నాగయ్యా, బాలే శంకర్,తాజా మాజీ కౌన్సిలర్ లు,పట్టణ నాయకులు, యూత్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular