Thursday, April 16, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుబాధిత కుటుంబానికి కంచర్ల వీణ కుమారి ఆర్థిక సహాయం

బాధిత కుటుంబానికి కంచర్ల వీణ కుమారి ఆర్థిక సహాయం

📰 Generate e-Paper Clip

సహాయం కోసం ఎదురుచూపు

నవగీతం,వైరా

వైరా మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటున్నా మెరిపో ప్రకాష్ కుమార్,సంధ్యారాణి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వీరిలో పెద్ద కుమార్తె లుధియా రాణి గత కొన్ని నెలలు క్రితం మతిస్థిమితం కోల్పోయింది. కూతురుకి చికిత్స చేయడం కోసం వైద్య ఖర్చులకు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న వైరా మాజీ జెడ్పిటిసి కంచర్ల వీణ కుమారి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.5000/- ఆర్థిక సహాయంగా తల్లిదండ్రులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రకాష్ కుమార్ సంధ్యారాణి దంపతులు నిరుపేద కుటుంబంకు చెందిన వారని రోజు కూలీ కి వెళ్తే తప్ప వారికీ ఇల్లు గడవదని అలాంటి పరిస్థితుల్లో కూతురి ఆరోగ్య పరిస్థితి ఇలా జరగటం చాలా బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. ప్రభుత్వం లూదియాకు సరైన చికిత్స అందించి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని ఆమె కోరారు. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలని లూదియా తల్లి దండ్రులు వేడుకున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular