నవగీతం,మల్లాపూర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న విద్యుత్ శాఖ వారి ప్రజాబాటలో భాగంగా మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామంలో విద్యుత్ ఏ ఈ సంతోష్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ ఆవరణలో ప్రజా బాట నిర్వహించారు. ఏ ఈ సంతోష్ మాట్లాడుతూ గ్రామంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ విద్యుత్ సమస్యలు ముందుకు తీసుకురావాలని వాటిని పరిశీలించి వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బాల్సని ప్రణయ్,వార్డు మెంబర్లు ఇట్టేడి శంకర్, మట్ట రాములు, రామగిరి సంజీవ్, ఉప్పులూటి లక్ష్మీ నారాయణ, సంపాతి ఆశలు, దండుగుల అంజిరాజు, సార్ల దేవరెడ్డి, లైన్మెన్ శంకర్, విద్యుత్ అధికారులు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

