పూల్ సింగ్ ను బహిరంగంగా ఉరి తీయాలి
జగిత్యాల జిల్లా బిజెపి నాయకులు డిమాండ్
నవగీతం,జగిత్యాల:
అణగారిన వర్గాలైన బీసీ ఎస్సీ ఎస్టీలకు కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి వ్యతిరేకమని, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పూల్ సింగ్ బరయ్య బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలే నిదర్శనమని బిజెపి జిల్లా నాయకులు రాగిల్ల సత్యనారాయణ, కోశాధికారి సుంకేటి దశరథ రెడ్డి, మర్రి పెల్లి సత్యమ్ డిమాండ్ చేశారు. మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ఎస్సీ ఎస్టీ ఆదివాసి కులాలలో అందగత్తెలు ఉండరని, అయినా వారిపై లైంగిక దాడులు జరుగుతున్నాయన్నారు. వారితో సంభోగం జరిపితే తీర్థయాత్రలకు వెళ్లొచ్చినంత పుణ్యం దక్కుతుందని మాట్లాడడం అణగారిన వర్గాలను అవమాణించడమే నన్నారు. లైంగిక దాడి చేస్తే పుణ్యం దక్కుతుందని పురాణాల్లో రాసిఉందని కాబట్టి తీర్థయాత్రకు వెళ్లలేని వారు అందుకు ప్రత్యామ్నాయంగా ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలపై లైంగిక దాడులు చేస్తున్నారని వ్యాఖ్యానించడం యావత్ మహిళా లోకానికే అవమానకరమని మండి పడ్డారు. స్త్రీని దేవత రూపంలో చూసే భారతదేశంలో ఇలాంటి దుర్మార్గులు ఉండడం సిగ్గు చేటని ఇలాంటి ఎమ్మెల్యే పూల్ సింగ్ లను బహిరంగంగా ఊరితీయాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా అసలు మహిళల అనుమతి లేనిదే మానభంగాలు జరగవని అత్యాచారం జరిగే సమయంలో మహిళలు కూడా అందుకు సహకరిస్తున్నారని చేసిన వ్యాఖ్యలు కోట్లాది మహిళల హృదయాలను గాయపరిచాయని ఆవేదన వ్యక్తం చేశారు. వస్త్రధారణ విషయంలో నటి అనసూయ చేసిన వ్యాఖ్యలకు మద్దతు తెలిపిన మహిళా సంఘాలు, మహిళా కమిషన్, దళిత సంఘాలు, క్యాండిల్ ర్యాలీలు చేసేవాళ్లు తుక్డే తుక్డే గ్యాంగుల నోర్లు ఎందుకు మూతపడ్డాయని వీరంతా ఎమ్మెల్యే పూల్ సింగ్ విషయంలో ఎందుకు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేముల రోహిత్ దళితుడని అతనికి జరిగిన కుల వివక్ష పై చట్టం తీసుకువస్తావన్న ఏఐసిసి నాయకులు రాహుల్ గాంధీ తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దేశంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలను కించపరిచేలా సొంత పార్టీ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యే పూల్ సింగ్ శాసనసభ సభ్యత్వాన్ని వెంటనే రద్దుచేసి కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి జైలుకు పంపించి సత్వర విచారణ జరిపించి శిక్ష పడేలా చేయాలని డిమాండ్ చేశారు. ఈసమావేశంలో మాజీ కౌన్సిలర్ కాయితీ శంకర్, పట్టణ నాయకులు రాపర్తి రాజ్ కుమార్, బైరి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు..

