Thursday, February 26, 2026
ads
Homeజిల్లా వార్తలుజగిత్యాలఅంగరంగ వైభవంగా మల్లన్న బోనాలు

అంగరంగ వైభవంగా మల్లన్న బోనాలు

📰 Generate e-Paper Clip

నవగీతం,మల్లాపూర్

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం నడికుడ గ్రామంలో మంగళవారం మల్లన్న స్వామికి భక్తులు అంగరంగ వైభవంగా చల్ల కుండ బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామమంతా పండగ వాతావరణం నెలకొంది. ప్రతి సంవత్సరం సాంప్రదాయంగా నిర్వహించే మల్లన్న స్వామి జాతరలో భాగంగా ఈ బోనాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. యువకులు, మహిళలు సహా గ్రామ ప్రజలంతా ఉత్సాహంగా పాల్గొని మల్లన్న స్వామిని భక్తిశ్రద్ధలతో ఆరాధించారు. చల్ల కుండ బోనాలతో స్వామికి నైవేద్యం సమర్పించి జాతరను వైభవంగా నిర్వహించారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular