Sunday, November 8, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలఇచ్చిన హామీలు ,ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం..

ఇచ్చిన హామీలు ,ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం..

📰 Generate e-Paper Clip

ముఖ్యమంత్రి జన్మదిన వేడుకల్లో మంత్రి అడ్లూరి.

పెద్దపల్లి/ధర్మారం,నవంబర్8,(నవగీతం):

ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చుతామని, రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు తో పాటు దీపావళి వేడుకల్లో పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి అడ్లూరి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ధర్మారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం నిర్వహించిన ముఖ్యమంత్రి జన్మదిన వేడుకల్లో మంత్రి పాల్గొని కేక్ కట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం బెడ్డల నాగమణి బానేష్, తమ్మడపైన సరిత- రాజలింగు దంపతులకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి వద్ద దీపావళి వేడుకల్లో మంత్రి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ పేదల నాయకుడు రేవంత్ రెడ్డి అని అన్నారు. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి ని దేవుడు చల్లగా చూడాలని ఈ సందర్భంగా మంత్రి ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  పుట్టినరోజు తో పాటు దీపావళి పండుగ ఒకేరోజు రావడం సంతోషంగా ఉందని మంత్రి అన్నారు.

రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని ఆరోగ్యానికి హామీలు చేస్తామని మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ధర్మపురి నియోజకవర్గానికి మొదటి విడతలో 2500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసామని, రెండో విడతలో మరో రెండు వేల ఇళ్లను నిర్మిస్తామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చడానికి ఇప్పటివరకు ధర్మపురి నియోజకవర్గంలో సుమారుగా రూ. 275 కోట్లు ఖర్చు చేస్తున్నామని మంత్రి తెలిపారు.

ధర్మారం మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు ధర్మారం మండలంలో క్రీడా మైదానం నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. నియోజకవర్గంలోని చివరి ఆయకట్టు రైతులకు సాగునీటిని అందించి రైతుల ఆకాంక్షలను నెరవేర్చుతామని మంత్రి తెలిపారు.

చామనపల్లి గ్రామాన్ని 100% ముంపు గ్రామంగా తీసుకొని పరిహారం చెల్లించడానికి రూ. 350 కోట్ల జీవో విడుదల చేసినట్లు మంత్రి ప్రకటించారు. కార్యక్రమంలో ధర్మారం మండల పార్టీ అధ్యక్షుడు రూప్ల నాయక్ తో పాటు మండలంలో ని వివిధ గ్రామాల సర్పంచులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular