Friday, April 17, 2026
ads
Homeజిల్లా వార్తలుజగిత్యాలపిల్లల సంతోషమే సరస్వతీకి ఇష్టం

పిల్లల సంతోషమే సరస్వతీకి ఇష్టం

📰 Generate e-Paper Clip

దుర్గ భాయ్ దేశముఖ్ ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు దాసరి రజని

నవగీతం, జగిత్యాల

పిల్లల సంతోషంగా ఉండడమే సరస్వతికి చాలా ఇష్టమని, అందుకే చదువుల తల్లి వద్ద పిల్లలు మొదటగా అక్షరాభ్యాసం చేస్తారని దుర్గభాయ్ దేశముఖ్ ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు దాసరి రజని అన్నారు. ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు దాసరి రజని వసంత పంచమిని పురస్కరించుకొని చిన్న పిల్లలకు నోట్ బుక్కులు, పెన్నులు, డ్రాయింగ్ బుక్కులు, కలర్ పెన్సిల్లు అందజేశారు.ఈ సందర్బంగా రజని మాట్లాడుతూ వసంత పంచమి పర్వదినంను చిన్నారులు పవిత్రంగా భావిస్తారాని పేర్కొన్నారు.గత కొన్నేళ్లుగా పేదల కోసం పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేశానని తెలిపారు.చిన్నారుల కళ్ళల్లో సంతోషాన్ని చూడడమే తన లక్ష్యమని రజని తెలిపారు.సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న రజనీని పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజేషన్ ఉపాధ్యక్షురాలు ఎక్కల్దేవి శోభా, సలహాధారులు టీవీ అశోక్ కుమార్, బివి సుబ్బలక్ష్మి, కో ఆర్డినేటర్ నరేష్ యాదవ్, కో -కన్వీనర్ ఎన్నం కిషన్ రెడ్డి, కార్యదర్శి ఎక్కల్ దేవి లహరీ, లక్ష్మి హరిశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular