Thursday, April 16, 2026
ads
Homeఎడిటోరియల్మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల నుంచి దరఖాస్తులకు ఆహ్వానం

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల నుంచి దరఖాస్తులకు ఆహ్వానం

📰 Generate e-Paper Clip

నవగీతం,జగిత్యాల

రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయదలచిన ఆశావాహులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజంగి నందయ్య ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా పరిధిలోని జగిత్యాల, రాయికల్ మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేయదలచిన అభ్యర్థులు తమ దరఖాస్తులను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజంగి నందయ్యకు సమర్పించాలని కోరారు.దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తమ పాస్‌పోర్ట్ సైజు ఫోటోను దరఖాస్తుతో పాటు జత చేయాలని సూచించారు. మరిన్ని వివరాలకు 7780127677 నంబర్‌లో సంప్రదించాలని గాజంగి నందయ్య తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular