Saturday, March 7, 2026
ads
Homeజిల్లా వార్తలుజగిత్యాలనేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు

నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు

📰 Generate e-Paper Clip

నవగీతం,ఇబ్రహీంపట్నం

ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భముగా యువజన సంఘాల సమితి మెట్ పల్లి డివిజన్ అధ్యక్షులు కొడిమ్యాల దీపక్ రాజ్ మాట్లాడుతూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారత స్వాతంత్ర్య సంగ్రామం లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఆజాద్ హింద్ ఫౌజ్ ఆర్మీని స్థాపించి దేశ స్వాతంత్ర్యం కోసం ఆంగ్లేయులతో పోరాడాడు అని, మీరు నాకు రక్తం ఇవ్వండి నేను మీకు స్వాతంత్ర్యం ఇస్తాను అని ఎందరికో పోరాట స్పూర్తిని అందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నాంపల్లి రమేష్, వార్డు సభ్యులు కల్లెడ రాజశేఖర్, బొమ్మన గణేష్ ,సేవాదళ్ మండల అధ్యక్షుడు సొల్లు ముత్యం , మాజీ ఎంపీటీసి సభ్యులు గూడ రాజారెడ్డి, బంగారు హరిదాసు, తిమ్మని సురేష్,గూడ గంగారెడ్డి, గంగాధర్,రాజారెడ్డి తదితరులు పాల్గోన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular