Thursday, February 26, 2026
ads
Homeఆంధ్రప్రదేశ్నాందేడ్ చేరుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

నాందేడ్ చేరుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

📰 Generate e-Paper Clip

ప్రభుత్వ అతిథి హోదాలో స్వాగతించిన మహారాష్ట్ర ప్రభుత్వం

శ్రీ గురు తేగ్ బహదూర్ సింగ్ 350వ ఆత్మార్పణ దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాన్ ప్రముఖ సిక్కు గురువు శ్రీ గురు తేగ్ బహదూర్ సింగ్ 350వ ఆత్మార్పణ దినోత్సవం వేడుకల్లో పాల్గొనేందుకు నాందేడ్ విచ్చేసిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ప్రభుత్వ అతిథిగా మహారాష్ట్ర సర్కార్ స్వాగతం పలికింది. నాందేడ్ లోని గురు గోవింద్ సింగ్ విమానాశ్రయంలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యులు అశోక్ చవాన్ , ఆయన కుమార్తె భోకార్ శాసన సభ్యురాలు శ్రీజయ చవాన్, శాసన మండలి సభ్యులు  రాజార్ కర్, నాందేడ్ జిల్లా కలెక్టర్  రాహుల్ ఖరడ్లే తదితరులు ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్ కు ఘనంగా స్వాగతం పలికారు. బస దగ్గర నాందేడ్ జిల్లా ఇంఛార్జ్ మంత్రి  అజిత్ సావే, రాజ్యసభ సభ్యులు  అజిత్ గోప్ చడే, ఆర్.ఎస్.ఎస్. ప్రముఖులు  రాజేంద్ర కోడగే తదితరులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను స్వాగతించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular