Friday, April 17, 2026
ads
Homeజిల్లా వార్తలుజగిత్యాలప్రతి పౌరుడికి సమాన హక్కులను కల్పించిన గొప్ప పత్రం భారత రాజ్యాంగం

ప్రతి పౌరుడికి సమాన హక్కులను కల్పించిన గొప్ప పత్రం భారత రాజ్యాంగం

📰 Generate e-Paper Clip

టియూడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాస రావు

జిల్లా కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

నవగీతం,జగిత్యాల:

ప్రతి పౌరుడికి సమాన హక్కులను కల్పించిన గొప్ప పత్రం భారత రాజ్యాంగం అని టియూడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాస రావు అన్నారు. 77 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంపులో గల టియూడబ్ల్యూజే ఐజేయు జిల్లా కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసి, స్వీట్లు పంపిణీ చేసి  గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ మనం 1947 ఆగస్టు 15న బ్రిటీష్ పాలన నుండి స్వాతంత్ర్యం పొందినప్పటికీ, మనకంటూ ఒక సొంత చట్టం, ఒక రాజ్యాంగం ఏర్పడింది మాత్రం 1950 జనవరి 26న అన్నారు. ఆ రోజునే మన దేశం పూర్తిస్థాయి గణతంత్ర రాజ్యంగా అవతరించిందని తెలిపారు. అందుకే ప్రతి ఏటా ఈ రోజును మనం ఎంతో గర్వంగా జరుపుకుంటాం అని వివరించారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు పాత్రికేయులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యూజే ఐజేయు జిల్లా ప్రధాన కార్యదర్శి బెజ్జెంకి సంపూర్ణ చారి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగుల గోపాల చారి, ఆదిల్, జిల్లా ఉపాధ్యక్షులు హైదర్ అలీ, కోశాధికారి సిరిసిల్ల వేణుగోపాల్, సంయుక్త కార్యదర్శులు గుర్రం చంద్ర శేఖర్, చింత నరేష్, కార్యవర్గ సభ్యులు మనోజ్, నరేష్, శ్రీకాంత్, తాండ్ర శంకర్ గౌడ్, జగిత్యాల పట్టణ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎల్లాల రాజేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శశిధర్, ఉపాధ్యక్షులు ముసిపట్ల దేవేందర్, బద్దెనపల్లి మల్లేశం, శనిగరపు శ్రీనివాస్, సీనియర్ పాత్రికేయులు వేణుగోపాల్, అంజయ్య, స్వామి, లక్ష్మారెడ్డి, ఆనంద్, పలువురు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular