Saturday, March 7, 2026
ads
Homeజిల్లా వార్తలుజగిత్యాలపారిశుద్ధ సిబ్బందికి ఇన్సూరెన్స్ సౌకర్యం :సర్పంచ్ చల్ల రక్షిత -పురుషోత్తం

పారిశుద్ధ సిబ్బందికి ఇన్సూరెన్స్ సౌకర్యం :సర్పంచ్ చల్ల రక్షిత -పురుషోత్తం

📰 Generate e-Paper Clip

నవగీతం,ఇబ్రహీంపట్నం:

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇబ్రహీంపట్నం మండలంలోని కోజన్ కొత్తూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ చల్ల రక్షిత -పురుషోత్తం గ్రామపంచాయతీ ఆవరణలో జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ తన సొంత ఖర్చులతో జిపి పారిశుద్ధ కార్మికులకు, కారోబర్ కు పోస్ట్ ఆఫీస్ ద్వారా రూ 10 లక్షల ప్రమాద బీమాను కల్పించి, బాండ్లను అందించారు. అనంతరం మాట్లాడుతూ పరిశుద్ధ కార్మికుల నిరంతర శ్రమ వల్ల గ్రామం పరిశుభ్రంగా ఉంటుందని ,వారి శ్రమకు ప్రతిఫలంగా తన వంతుగా బీమా సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి రాకేష్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular