Thursday, April 16, 2026
ads
Homeఎడిటోరియల్వైరా మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధం

వైరా మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధం

📰 Generate e-Paper Clip

3 ప్రభుత్వ కార్యాలయాలలో నామినేషన్ల స్వీకరణ

నవగీతం,వైరా:


ఫిబ్రవరి 11వ తేదీన జరగనున్న వైరా మున్సిపాలిటీ ఎన్నికలకు అధికారులు సర్వం రంగం సిద్ధం చేశారు. మున్సిపాలిటీలో ఉన్న 20 వార్డుల నామినేషన్లను మూడు ప్రభుత్వ కార్యాలయాల్లో స్వీకరించనున్నారు. ఇప్పటికే ఈ ఎన్నికలకు సంబంధించి ఏడుగురు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, కంప్యూటర్ ఆపరేటర్లను నియమించారు. మొత్తం 20 వార్డులను ఏడు భాగాలుగా విభజించి అధికారులను కేటాయించారు. 1,2,3 వార్డులకు రిటర్నింగ్ అధికారిగా కే.రమేష్ రాజు, 4,5,6 వార్డులకు రిటర్నింగ్ అధికారిగా ముళ్ళపూడి రాంబాబు,7,8,9 వార్డులకు రిటర్నింగ్ అధికారిగా సిహెచ్ నాగేశ్వరరావు, 10,11,12 వార్డులకు రిటర్నింగ్ అధికారిగా టి అనిల్ కుమార్, 13,14,15 వార్డులకు రిటర్నింగ్ అధికారిగా టి పూర్ణచంద్రరావు, 16,17,18 వార్డులకు రిటర్నింగ్ అధికారిగా దొండపాటి శ్రీనివాస్, 19,20 వార్డులకు రిటర్నింగ్ అధికారిగా బి శ్రీమన్నారాయణ లను నియమించారు.మున్సిపాలిటీలోని 1,2,3,4,5,6,13,14,15 వార్డులకు సంబంధించిన నామినేషన్లను వైరాలోని మండల పశు వైద్యశాల సమీపంలో ఉన్న నియోజకవర్గ స్థాయి రైతు శిక్షణ కేంద్రంలో స్వీకరిస్తారు. 7,8,9,10,11,12 వార్డులకు సంబంధించిన నామినేషన్లను వైరా తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న సమావేశ మందిరంలో అధికారులు స్వీకరించినన్నారు. 16,17,18,19,20 వార్డులకు సంబంధించిన నామినేషన్లను ఎంపీడీవో కార్యాలయంలో ఉన్న సమావేశ మందిరంలో స్వీకరించనున్నారు. అదేవిధంగా ఎన్నికల ముందు రోజు ఎన్నికల సామగ్రి పంపిణీ, రిసెప్షన్ సెంటర్ ను, పోలింగ్ బాక్స్ లో భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ ను, ఎన్నికల కౌంటింగ్ ను వైరాలోని నియోజకవర్గ స్థాయి రైతు శిక్షణ కేంద్రంలో నిర్వహించనున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular