Thursday, April 16, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుసత్తుపల్లిలో పుర పోరుకు సర్వం సిద్ధం

సత్తుపల్లిలో పుర పోరుకు సర్వం సిద్ధం

📰 Generate e-Paper Clip

నవగీతం,సత్తుపల్లి:

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ విడుదల కావడంతో సత్తుపల్లి మున్సిపాలిటీలో ఫిబ్రవరి 11వ తేదీన జరగనున్న సత్తుపల్లి మున్సిపాలిటీ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. మున్సిపాలిటీలో 28,830 మంది ఓటర్లకు పురుషులు 13620, స్త్రీలు 15,195, ఇతరులు 15 మంది ఉన్నారు. మున్సిపాలిటీలో 23 వార్డుల నామినేషన్లు సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయాల్లో స్వీకరించనున్నారు. ఇప్పటికే ఈ ఎన్నికలకు సంబంధించి ఎనిమిది మంది ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, కంప్యూటర్ ఆపరేటర్లను నియమించారు.
మొత్తం 23 వార్డులకు ఎనిమిది భాగాలుగా విభజించి అధికారులను కేటాయించారు. 48 పోలింగ్ కేంద్రాలను13, లొకేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సత్తుపల్లి మున్సిపాలిటీలో నామినేషన్లు ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సేకరించనున్నారు. అదేవిధంగా ఎన్నికల ముందు రోజు ఎన్నికల సామగ్రి పంపిణీ, రిసెప్షన్ సెంటర్ ను, పోలింగ్ బాక్సులు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ ను, ఎన్నికల కౌంటింగ్ ను, వచ్చే నెల13న జరిగే మున్సిపల్ కౌంటింగ్ సత్తుపల్లి పట్టణంలో స్థానిక జ్యోతి నిలయం విద్యాలయంలో నిర్వహించనున్నారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular