Thursday, February 26, 2026
ads
Homeకరీంనగర్ఆర్థిక వ్యవస్థపై కృత్రిమ మేధస్సు(AI) అంశంపై జాతీయ సదస్సు

ఆర్థిక వ్యవస్థపై కృత్రిమ మేధస్సు(AI) అంశంపై జాతీయ సదస్సు

📰 Generate e-Paper Clip

నవగీతం,కరీంనగర్:

శాతవాహన విశ్వవిద్యాలయం కరీంనగర్ అర్థశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో భారత ఆర్థిక వ్యవస్థపై కృత్రిమ మేధస్సు యొక్క ప్రభావం అనే అంశంపై రెండు రోజులు ఫిబ్రవరి 4, 5వ తేదీన , జాతీయస్థాయి సదస్సు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ సదస్సు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, హైదరాబాద్ ఉపకులపతి ప్రొఫెసర్.గంటా చక్రపాణి, ప్రత్యేక అతిథులుగా విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్. ఉమేష్ కుమార్, రిజిస్టార్ ప్రొఫెసర్.సతీష్ కుమార్ మరియు కీలకోపన్యాస వక్తగా ప్రొఫెసర్. చిట్టిడి కృష్ణారెడ్డి , యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ విచ్చేయుచున్నారు. దేశవ్యాప్తంగా వివిధ అంశాలపై 40 మంది తమ పరిశోధక పత్రాలను సమర్పించనున్నారు. కావున ఆచార్యులు, అధ్యాపకులు, పరిశోధకులు విద్యార్థులు విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని సదస్సును విజయవంతం చేయాలని సదస్సు కన్వీనర్ అర్థశాస్త్ర విభాగ అధిపతి డాక్టర్. కోడూరి శ్రీవాణి ఒక ప్రకటనలో తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular