నవగీతం,కరీంనగర్:
శాతవాహన విశ్వవిద్యాలయం, అర్థశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో గురువారం రోజున యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ లా కళాశాల సెమినార్ హల్ లో “భారత ఆర్థిక వ్యవస్థపై కృత్రిమ మేధస్సు యొక్క ప్రభావం “అనే అంశంపై రెండు రోజుల జాతీయస్థాయి సదస్సు ముగిసింది. రెండవ రోజు సదస్సు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రొఫెసర్. ఖాజా అల్తాఫ్ హుస్సేన్, ఉపకులపతి మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, నల్గొండ మాట్లాడుతూ అన్ని రంగాల్లో కృత్రిమ మేధస్సును విరివిగా ఉపయోగించిడం వలన భారత ఆర్ధిక వ్యవస్థను కృత్రిమ మేధస్సు ప్రభావితం చేస్తుందన్నారు.

విశిష్ట అతిథిగా విచ్చేసిన విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొ. ఉమేష్ కుమార్ మాట్లాడుతూ విద్య, వైద్య, పర్యాటక మరియు అన్ని రంగాలలో కృత్రిమ మేధస్సును ఉపయోగించడం వలన ఉత్పత్తిని పెరిగి ఆర్థిక వ్యవస్థలో వృద్ధి రేటు పెరుగుదల గణనీయంగా ఉందన్నారు.ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన విశ్వవిద్యాలయ రిజిస్టర్ ప్రొ.సతీష్ కుమార్ మాట్లాడుతూ కృత్రిమ మేధస్సును ఉపయోగించి ఇంజనీరింగ్, నానో రంగంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి అని పేర్కొన్నారు. మరొక అతిధి ప్రొ. సురేష్ లాల్, డైరెక్టర్ స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, కాకతీయ విశ్వవిద్యాలయం మాట్లాడుతూ ముఖ్యంగా భారత వ్యవసాయ రంగంలో కృత్రిమ మేధస్సును విరివిరీగా ఉపయోగించి వలసిన అవసరం ఉందన్నారు. పరిశోధనా రంగంలో కృత్రిమ మేధస్సును ఉపయోగించి ఎన్నో ఫలితాలు సాధించవచ్చు అని డాక్టర్. మహ్మద్ జాఫర్ జరి పేర్కొన్నారు. సెమినార్ కన్వీనర్ అర్థశాస్త్ర విభాగపు అధిపతి డాక్టర్ కె. శ్రీవాణి మాట్లాడుతూ కృత్రిమ మేధస్సు- భారత ఆర్థిక వ్యవస్థ పై దాని ప్రభావం అనే అంశంపై రెండు రోజుల జాతీయ స్థాయి సదస్సుకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు దాదాపు 60 పరిశోధన పత్రాలను సమర్పించారని, వాటిలో ముఖ్యమైన పరిశోధన పత్రాలను జర్నల్స్ రూపంలో ముద్రించి విడుదల చేశామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాల ఆర్ట్స్ అండ్ లా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె. పద్మావతి, ప్రొ. ఏం. వరప్రసాద్, ప్రొ.సూరేపల్లి సుజాత, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్. మహ్మద్ అబ్రహర్ బాకీ, డాక్టర్ .డి హరి కాంత్ డాక్టర్. ఉమేరా తస్లీమ్, డాక్టర్. మునావర్, డాక్టర్ విజయ్ ప్రకాష్, డాక్టర్. డి.సత్యనారాయణ, డాక్టర్. విద్యాసాగర్, అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

