నవగీతం, జగిత్యాల ప్రతినిధి:
జగిత్యాల జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు ఇంటర్మీడియట్ పరీక్షల్లో విశిష్ట ఫలితాలు సాధించాయి.ఈ సందర్భంగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినులను జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్, అదనపు కలెక్టర్ (రెవిన్యూ) బి.ఎస్.లత తో కలిసి అభినందించి ప్రశంసించారు. వారి కృషి మరియు పట్టుదల ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో కె.జి.బి.వి రాయికల్‌కు చెందిన ఎస్.శృతి 1000 మార్కులకు 988 మార్కులు. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో కె. కార్తీక 500 మార్కులకు 492 మార్కులు సాధించారు.ఈ సందర్భంగా అత్యుత్తమ ప్రతిభ సాధించినందుకు జిల్లాకు గర్వకారణమని తెలిపారు.

ఈ నేపథ్యంలో అధికారులు ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థినుల కృషి, ఉపాధ్యాయుల మార్గదర్శకత మరియు తల్లిదండ్రుల సహకారం వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇంకా మెరుగైన ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సంవత్సరం ఫలితాలు గత సంవత్సరాలతో పోలిస్తే మెరుగ్గా ఉన్నాయని తెలిపారు. జగిత్యాల జిల్లాలోని మొత్తం 12 కె.జి.బి.వి లలో ప్రథమ సంవత్సరంలో 89.52 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ద్వితీయ సంవత్సరంలో 92.72 శాతం ఉత్తీర్ణత సాధించారు.ఈ సందర్భంగా విజేత విద్యార్థినులను సత్కరించారు. అందరికీ అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి కె.రాము, సంబంధిత కోఆర్డినేటర్లు, పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు తదితరులు పాల్గొన్నారు.


