Thursday, February 26, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలప్రభుత్వ పాఠశాలల ఎస్ జి టి పోస్టుల రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి

ప్రభుత్వ పాఠశాలల ఎస్ జి టి పోస్టుల రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి

📰 Generate e-Paper Clip

తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ వినతి

నవగీతం,జగిత్యాల ప్రతినిధి:

ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ,ఎస్ జి టి పోస్టుల రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, శాస్త్రీయ రేషనలైజేషన్ ప్రక్రియపై ఉపాధ్యాయ సంఘాలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కటకం రమేష్, మారెడ్డి అంజిరెడ్డి లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ను కలిసి వినతి పత్రం అందజేశారు.ఇటీవలి నివేదికల ప్రకారం, సుమారు 2,325 ఎస్ జి టి పోస్టులను రద్దు చేసి, 2,064 కొత్త పోస్టులను సృష్టించే ప్రక్రియ ఆందోళన కలిగిస్తోందని, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే ఉపాధ్యాయుల కొరత ఉండగా, ఉన్న పోస్టులను రద్దు చేయడం వల్ల ప్రభుత్వ పాఠశాలలు మరింత బలహీనపడతాయన్నారు. కావున ప్రభుత్వ పాఠశాలలో ఎస్ జి టి పోస్టుల రద్దు ప్రతిపాదన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. అదేవిధంగా ప్రాథమిక పాఠశాలల్లో తరగతి ఒక ఉపాధ్యాయుడు ఉంటూ, ప్రతి ప్రాథమిక పాఠశాలకు కనీసం ఐదుగురు ఉపాధ్యాయులు ఉండాలని, కేవలం విద్యార్థుల సంఖ్యతో ముడిపెట్టి ఉపాధ్యాయులను తగ్గించడం శాస్త్రీయమైనది కాదన్నారు.పర్యవేక్షణ బాధ్యతల కోసం ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఒక ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు  పోస్టును మంజూరు చేయాలన్నారు శాస్త్రీయ రేషనలైజేషన్ (1:20 నిష్పత్తి) ప్రభుత్వ పాఠశాలల మనుగడ సాధ్యపడాలన్నా,నాణ్యమైన విద్య అందాలన్నా, ప్రాథమిక స్థాయిలో 1:20 నిష్పత్తిని అమలు చేయాలని, కనీసం ఐదుగురు ఉపాధ్యాయులను కేటాయించిన తర్వాతే, మిగిలిన పోస్టుల భర్తీకి ఈ నిష్పత్తిని ప్రాతిపదికగా తీసుకోవాలన్నారు. హైస్కూళ్లలో అదనపు తరగతి లేదా సెక్షన్ పెరిగినప్పుడు మొదట ఒక సబ్జెక్టు, తర్వాత మరొకటి అన్నట్లుగా కాకుండా అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ఉపాధ్యాయులను కేటాయించాలని, సెక్షన్ పెరిగినప్పుడు అన్ని సబ్జెక్టులు బోధించాల్సి ఉంటుంది కాబట్టి, ఈ నిర్ణయం అత్యవసరం అన్నారు.జీరో ఎన్రోల్మెంట్ పాఠశాలలను నూతన హేబిటేషన్లో క్యాచ్ మెంట్ ఏరియా పరిశీలన చేసి, వాటిని అక్కడ నూతనంగా ప్రారంభించాలని, ఏ పాఠశాలలను మూసి వేయవద్దని కోరారు. గతంలో ఇట్లా తరలించిన పాఠశాలలు విద్యార్థులతో ఈరోజు బలంగా ఉన్నాయని, అక్కడి విద్యార్థులకు ఉపయుక్త కరంగా అవి మారాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అటువంటి పాఠశాలలను ఉదాహరణగా తీసుకొని జీరో ఎన్రోల్మెంట్ పాఠశాలలను అక్కడికి తరలించి పాఠశాలలను కొనసాగించాలని కోరారు.ఇట్టి విషయాలు అన్ని చర్చించడానికి ఉపాధ్యాయ సంఘాల సమావేశం ఏర్పాటు చేయాలన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular