Thursday, February 26, 2026
ads
Homeతెలంగాణరాజన్న సిరిసిల్లమహిళల రక్షణే షీ టీమ్స్ ప్రధాన లక్ష్యం

మహిళల రక్షణే షీ టీమ్స్ ప్రధాన లక్ష్యం

📰 Generate e-Paper Clip

నవగీతం,రుద్రంగి:

మహిళల రక్షణకు షి టీమ్ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలకేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో శనివారం షీ టీం జిల్లా ఇంచార్జ్ ప్రమీల విద్యార్థులకు అవగాహన కల్పించాచారు. ఈ సందర్భముగా వారు మాట్లాడుతూ.. మహిళలు, యువతులు, బాలికలు ఆకతాయిల వలన గాని, మరే విధమైన వేధింపుల వలన గాని ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే నిర్భయంగా షీటీమ్స్ ని సంప్రదించవచ్చని తెలిపారు. జిల్లాలో విద్యార్థినులు, మహిళలు అన్యాయానికి గురైనప్పుడు భయపడొద్దని, ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే నిందితులపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు. కళాశాల, పాఠశాలల విద్యార్థినులు ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ లకు గురైనా మహిళలు పని చేసే ప్రదేశాల వద్ద వేధింపులకు గురైనా బాలికలపై ఎవరైనా లైంగిక వేధింపులకు పాల్పడినట్లైతే వెంటనే నిర్భయంగా షీ టీమ్ పోలీసులకు తెలుపాలని మహిళలు సామాజిక మాద్యమాలైన ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వినియోగంలో జాగ్రత్తలు వహించాలని, వాటిలో ఫొటోలు, వీడియోలు పోస్టుచేసే సమయంలో వ్యక్తిగత భద్రతకు సంబంధించి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎవరైన ఇబ్బంది పెట్టినట్లైతే నేరుగా 8712656425 ఫోన్ నంబరుకు గాని డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సమ్మి రెడ్డి, షీ టీం సభ్యులు వీరయ్య, శ్రీనివాస్, ప్రియాంక, శ్రీలత ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular