Tuesday, April 14, 2026
ads
Homeకరీంనగర్పట్టణాల అభివృద్ధి కోసం ప్రత్యేక చొరవ తీసుకుంటా.. మేడిపల్లి సత్యం

పట్టణాల అభివృద్ధి కోసం ప్రత్యేక చొరవ తీసుకుంటా.. మేడిపల్లి సత్యం

📰 Generate e-Paper Clip

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి.

నవగీతం,చొప్పదండి:

చొప్పదండి పురపాలక సంఘం ఎన్నికలలో భాగంగా 3,6,8,9,10,14 వార్డులలో కాంగ్రెస్ పార్టీ బలపరచిన అభ్యర్థులకు మద్దతుగా చొప్పదండి శాసనసభ్యులు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మేడిపల్లి సత్యం సుడిగాలి ప్రచారం చేశారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పట్టణాల అభివృద్ధి కోసం ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని, కాంగ్రెస్ పార్టీ బలపరచిన అభ్యర్థులకు ఓటేసి చొప్పదండి పట్టణాన్ని అభివృద్ధి చేసే అవకాశం కల్పించాలని కోరారు. చొప్పదండి పట్టణంలో గతంలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయిస్తున్నామని అందరి ఆశీర్వాదంతో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి తెలంగాణ ప్రజా ప్రభుత్వానికి అండగా ఉండాలన్నారు.కార్యక్రమలో మండల కాంగ్రెస్ నాయకులు, కౌన్సిలర్ అభ్యర్థులు, వార్డుల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular