మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అన్ని వర్గాల ప్రజలు పోలీసులకు సహకరించాలి.
నవగీతం, జగిత్యాల ప్రతినిధి:
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలనే లక్ష్యంతో జిల్లా ఎస్పి అశోక్ కుమార్ ఆదేశాల మేరకు సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది.

ఈ ఫ్లాగ్ మార్చ్‌ను డిఎస్పి రఘు చందర్ ప్రారంభించారు.ఈ ఫ్లాగ్ మార్చ్ మంచి నీళ్ల బావి నుంచి ప్రారంభమై, తీన్ కానీ, టవర్ సర్కిల్, న్యూ బస్ స్టాండ్ ప్రాంతాల మీదుగా సాగింది.ఈ సందర్భంగా జిల్లా డిఎస్పి మాట్లాడుతూ 11వ తేదీన జరగనున్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రజలంతా ఎలాంటి భయాందోళనలు లేకుండా పోలింగ్‌కు హాజరై తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునే విధంగా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు.

ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.మద్యం,నగదు లేదా ఇతర ప్రలోభాల ద్వారా ఓటర్లను ప్రభావితం చేయడానికి ఎవరైనా ప్రయత్నించినట్లు తమ దృష్టికి వస్తే, ఎన్నికల నియామావళి ప్రకారం సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. అలాగే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఎవరైనా ప్రవర్తించినట్లయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.ప్రజలు, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు పోలీస్ శాఖకు సహకరించి ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు.ఈ ఫ్లాగ్ మార్చ్‌లో ఇన్స్పెక్టర్ లు సుధాకర్, కరుణాకర్,ఎస్.ఐ లు,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

