తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సీ. సుదర్శన్ రెడ్డి
నవగీతం, జగిత్యాల ప్రతినిధి :
ఎస్ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సీ. సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్ నుండి తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహణపై అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫెరెన్సు నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ ఐడీఓసీ కార్యాలయం జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ అన్ని జిల్లాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మ్యాపింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేసి, రివిజన్ శాతం పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మ్యాపింగ్‌లో ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా ప్రతి ఇంటి నుండి ఖచ్చితమైన వివరాలు సేకరించాలని అన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మ్యాపింగ్ శాతాన్ని పెంచేందుకు బూత్ లెవల్ ఆఫీసర్లు తప్పనిసరిగా ఫీల్డ్ విజిట్ చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇంటింటి సర్వే ద్వారా ఓటర్ల వివరాలను నిర్ధారించి, శాతం పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు తమ బూత్ లెవల్ ఏజెంట్లను వెంటనే నియమించుకునేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మ్యాపింగ్ సమయంలో తప్పు ఎంట్రీలు, తప్పు లింకింగ్‌లు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఓటర్ల సౌలభ్యం కొరకు బుక్ ఎ కాల్ సదుపాయంపై విస్తృత ప్రచారం నిర్వహించాలని తెలిపారు.

ప్రతి ఓటరు పేరు సరైన పోలింగ్ స్టేషన్‌కు మ్యాప్ కావడం ప్రజాస్వామ్యానికి కీలకమని, అధికారులు, సిబ్బంది పూర్తి బాధ్యతతో పని చేయాలని జిల్లా ఎన్నికల అధికారులకు సూచించారు. ఈ సందర్బంగా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 100 శాతం పూర్తయ్యేలా అధికారులందరు సమన్వయంతో పని చేసి ఈ ప్రక్రియను పారదర్శకంగా త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మ్యాపింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తూ అలాగే మ్యాపింగ్ లో ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా, తప్పు ఎంట్రీలు జరగకుండా ప్రతి ఓటరు మ్యాప్ అయ్యేవిధంగా ప్రతి ఇంటినుండి ఖచ్చితమైన, నిర్ధిష్టమైన వివరాలు సేకరించేలా అన్ని స్థాయిల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ కాన్ఫరెన్స్ లో జిల్లా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) బీఎస్. లత, జగిత్యాల, కోరుట్ల ఆర్డీవోలు మధు సూదన్, జీవాకర్ రెడ్డి, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు హకీమ్, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

