Thursday, February 26, 2026
ads
Homeతెలంగాణపెద్దపల్లినిబంధనల ప్రకారం పంచాయతీ పాలన కోనసాగాలి.. కలెక్టర్ కోయ శ్రీ హర్ష

నిబంధనల ప్రకారం పంచాయతీ పాలన కోనసాగాలి.. కలెక్టర్ కోయ శ్రీ హర్ష

📰 Generate e-Paper Clip

పంచాయతీ శాఖ పై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్

నవగీతం, పెద్దపల్లి:

నిబంధనల ప్రకారం పంచాయతీ పాలన కోనసాగాలని  జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో పంచాయతీ శాఖ పని తీరు పై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ.. పంచాయతీ లలో 3వ విద్యుత్ వైర్  లేకుండా ఇబ్బంది పడుతున్న ప్రాంతాల జాబితాను అందజేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామానికి తప్పనిసరిగా 3వ విద్యుత్ వైర్ ను విద్యుత్ శాఖ ద్వారా ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు చేపడతామని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో పారిశుధ్య నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, రోడ్లపై చెత్త ప్లాస్టిక్ ఉండకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. 

పంచాయతీ అనుమతి లేకుండా ఎటువంటి నిర్మాణాలు జరగడానికి వీలు లేదని,  నిర్మాణ దశలోనే అక్రమ నిర్మాణాలపై కఠినంగా వ్యవహరిస్తూ వాటిని ఆపివేయాలని , అక్రమ నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించ వద్దని కలెక్టర్ తెలిపారు. పంచాయతీ పాలనలో సర్పంచ్ లను భాగస్వామ్యం చేయాలని,  మండల పంచాయతీ అధికారులు రెగ్యులర్గా పారిశుధ్య పనులను పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు. గ్రామాలలో నిర్మించిన సెగ్రిగేషన్ షెడ్ లను పూర్తి స్థాయిలో తప్పనిసరిగా వినియోగించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య,  డివిజనల్ పంచాయతీ అధికారులు, మండల పంచాయతీ అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular