నవగీతం, రుద్రంగి:
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులు సీఎం కప్ పోటీల్లో భాగంగా సిరిసిల్లలోని మిని స్టేడియంలో గత రెండు రోజుల నుండి నిర్వహించిన వాలీబాల్ అథ్లెటిక్స్ పోటీల్లో విజయం సాధించి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. జడ్పీహెచ్ఎస్ రుద్రంగి పాఠశాలలో చదువుతున్న ముగ్గురు విద్యార్థిని విద్యార్థులు రాష్ట్రస్థాయి వాలీబాల్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు వాలీబాల్ లో పి మనీ విహార్ 9వ తరగతి ఈనెల 20వ తేదీ నుంచి 23వ తేదీ వరకు రాష్ట్రస్థాయి గచ్చిబౌలి హైదరాబాదులో జరిగే వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యాడు. అథ్లెటిక్స్ లో బి శ్రీవాణి పదవ తరగతి డిస్కస్ లో మరియు ఎన్ మనీషా పదవ తరగతి లాంగ్ జంప్ లో ఎంపికయ్యారు. వీరు హనుమకొండలో ఈ నెల 20వ తేదీ నుండి 23వ తేదీ వరకు జరిగే రాష్ట్రస్థాయి సీఎం కప్ రెండవ ఎడిషన్ పోటీలలో పాల్గొంటున్నారు రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కే సమ్మిరెడ్డి వ్యాయామ ఉపాధ్యాయుడు ఏ హనుమంతు ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు అభినందించారు.

