Thursday, February 26, 2026
ads
Homeఎడిటోరియల్మేయర్, కార్పోరేటర్లకు ఘన సన్మానం

మేయర్, కార్పోరేటర్లకు ఘన సన్మానం

📰 Generate e-Paper Clip

గత ప్రభుత్వాలను తలదన్నేలా అభివృద్ధి చేపట్టాలి.

బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్

నవగీతం ,కరీంనగర్;

గత ప్రభుత్వాలను తలాదన్నేలా కరీంనగర్ నగరపాలక సంస్థను అభివృద్ధి చేయాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్ కోరారు. గురువారం నూతనంగా ఎన్నికైన కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ ను , 46వ డివిజన్ కార్పొరేటర్ మల్లికార్జున రాజేందర్ ను , 49వ డివిజన్ కార్పొరేటర్ ఎన్నం.లక్ష్మి ప్రకాష్ ను తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం ఇచ్చి శాలువా తో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు అభివృద్ధి పేరుతో నిధులు మరలించారని అన్నారు.

ఈ నూతన కార్యవర్గంలో నగరపాలక సంస్థ అభివృద్ధి దిశగా కొనసాగించాలని , బీసీ సంక్షేమ సంఘం భవనానికి రెండు ఎకరాల భూమిని కేటాయించాలని కోరాము అని అన్నారు. అన్ని డివిజన్ లో గెలుపొందిన కార్పొరేటర్లు ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేర్చాలని అన్నారు.. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి వాయిల రాజ్ కుమార్ తో పాటు తీసి సంక్షేమ సంఘం అనుబంధ సంఘ నాయకులు పాల్గొన్నారు..

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular