Thursday, February 26, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలరైతులను ఆదుకోవాలి

రైతులను ఆదుకోవాలి

📰 Generate e-Paper Clip

మాజీ మంత్రి జీవన్ రెడ్డి

నవగీతం, జగిత్యాల ప్రతినిధి:

కురిసిన అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. పంట నష్టపోయిన రైతులతో కలిసి నష్టపోయిన పంటను మంగళవారం మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి పరిశీలించారు.కలెక్టర్, వ్యవసాయ శాఖ అధికారులతో ఫోన్ లో మాట్లాడి జరిగిన నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించాలని సూచించారు. జగిత్యాలలో నియోజకవర్గంలో సోమవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఈదురు గాలులతో కూడిన వర్షంతో మామిడి మొక్కజొన్న పంటను పరిశీలించి రైతులతో మాట్లాడారు. రాయికల్ మండలంలోని రామాజీపేట జగిత్యాల అర్బన్ మోతె, జిల్లాలో పలు గ్రామాలలో రైతులకు బారి నష్టం వాటిల్లిందని అన్నారు.రామోజీ పేట్ గ్రామంలో కొత్త వెంకటేష్ కౌలు రైతు నిర్మల్ నుండి వచ్చిన వలస కూలి తీవ్రంగా పంట నష్టపోయారన్నారు. పంట బీమా పథకం లేనందున ప్రభుత్వమే ఎకరాకు 20,000 నష్ట పరిహారం అందించాలన్నారు.రైతు దేశానికి వెన్నుముక అలాంటి రైతును రైతాంగాన్ని ఆదుకోవాలని సూచించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు బిడ్డ అని రైతుల పక్షాణ దృష్టి సారించాలని కోరారు. ప్రభుత్వం రైతులను అదుకుటుందని ఆశిస్తున్నట్లు వారికి హామీ ఇచ్చారు. రాష్ట్ర రైతాంగానికి ఫిబ్రవరి చివరిలోగా రైతు భరోసా అందించి రైతుకు అండగా నిలవాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular