Thursday, February 26, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలగోదావరి పుష్కరాల ఏర్పాట్ల పై అధికారులతో రివ్యూ

గోదావరి పుష్కరాల ఏర్పాట్ల పై అధికారులతో రివ్యూ

📰 Generate e-Paper Clip

నవగీతం, జగిత్యాల ప్రతినిధి:

గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు కట్టుదిట్టమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో 2027 గోదావరి నది పుష్కరాల ఏర్పాట్ల పై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ 2027 జూన్ 26 నుంచి 2027 జూలై 7 వరకు గోదావరి నదికి 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహా పుష్కరాలు జరుగుతాయని, దీనికి సంబంధించి మన జిల్లాలో భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు అవసరమైన ఘాట్ నిర్మాణం, రోడ్డు విస్తరణ, లైటింగ్, ఇతర ఏర్పాట్లు, ఆలయాల అభివృద్ధి కు ప్రతిపాదనలు తయారు చేసి వీలైనంత త్వరగా సమర్పించాలని కలెక్టర్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాజ గౌడ్, డి. పి.ఓ., డిఎస్పీలు వెంకటరమణ, రఘుచందర్, ఈఈ ఆర్ అండ్ బి, ఈఈ మిషన్ భగీరథ, మున్సిపల్ కమిషనర్, సంబంధిత అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular