Friday, February 27, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలఆధునిక చట్టాలు- రోడ్డు భద్రతపై అవగాహన

ఆధునిక చట్టాలు- రోడ్డు భద్రతపై అవగాహన

📰 Generate e-Paper Clip

నవగీతం, రాయికల్:

జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు, జగిత్యాల డీఎస్పీ రఘు చందర్ సూచనలతో రాయికల్ ఎస్సై సుధీర్ రావు ఆధ్వర్యంలో రాయికల్ మండలంలోని భూపతిపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలీస్ కళా బృందం వారిచే శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై సుదీర్ రావు సైబర్ నేరాలు, గంజాయి నిర్మూలన, ట్రాఫిక్ నియమాలు, సామాజిక రుగ్మతలు, మూఢనమ్మకాలు, రోడ్డు భద్రతా నియమావళి అంశాలపై విద్యార్థులకు వివరించారు. ‘అరైవ్-అలైవ్’ కార్యక్రమం భాగంగా రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆధునిక చట్టాలపై అవగాహన కల్పించారు. విద్యార్థినీ విద్యార్థులు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని చెడు వ్యసనాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో సానుకూల మార్పు వస్తుందని పాఠశాల ఉపాధ్యాయ బృందం ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ కార్యక్రమంలో ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు బొల్లె చిన్నయ్య, ఉపాధ్యాయులు శంకరయ్య, సత్యనారాయణ, సహబజ్ హుస్సేన్, సంజయ్ కుమార్, వేణుగోపాల్, సురేష్, పుష్పలత, భవానీ, శైలజ , పోలీస్ కళా బృందానికి చెందిన కానిస్టేబుళ్లు మనోజ్ కుమార్, గడ్డం రమేష్,కమల్, సతీష్, లక్ష్మణ్, హనుమంత్ పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular