నవగీతం,కొడిమ్యాల:
కొడిమ్యాల మండల కేంద్రంలో మేరు సంఘం అధ్యక్షుల ఆధ్వర్యంలో టైలర్స్ డే సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మేరు కుల దైవం జడగిరి శంకర దాసమయ్య కు ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సంఘ సభ్యుల సమక్షంలో కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు దీకొండ గంగాధర్, ఉపాధ్యక్షుడు రాపర్తి నర్సింగరావు, ప్రధాన కార్యదర్శి దీకొండ స్వామి, కోశాధికారి దీకొండ శ్రీనివాస్, రాపర్తి నవీన్ పాల్గొన్నారు. అలాగే సంఘ సభ్యులు దీకొండ గంగారం, దీకొండ గంగాధర్ రామగిరి నారాయణ, సోమ నర్సయ్య, దీకొండ రమేష్, సోమ వెంకటి, సోమ దేవదాస్, దీకొండ చంద్రశేఖర్, సోమ గణేష్, దీకొండ వెంకటరమణ, దీకొండ రాజేష్, దీకొండ గంగాప్రసాద్, శీలం లక్ష్మీ తదితరులు హాజరయ్యారు.

