జిల్లా అదనపు కలెక్టర్ బి.ఎస్.లత
మున్సిపల్ చైర్ పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్
నవగీతం, జగిత్యాల ప్రతినిధి:
జగిత్యాల పట్టణంలోని ఓల్డ్ హై స్కూల్‌లో రోటరీ క్లబ్ మరియు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన రీయూజబుల్ మరియు వాషబుల్ క్లాత్ సానిటరీ ప్యాడ్ కిట్స్ పంపిణీ కార్యక్రమంలో జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి సమీండ్ల వాణి శ్రీనివాస్ మరియు జిల్లా అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… వినడం ద్వారా నేర్చుకునే దానికన్నా చూసి నేర్చుకోవడం విద్యార్థులకు ఎక్కువ ప్రయోజనం కలిగిస్తుందని అన్నారు. అందువల్ల డిజిటల్ విద్య ద్వారా విద్యార్థులు పాఠాలను సులభంగా అర్థం చేసుకుని మెరుగైన విద్యను అభ్యసించగలరని తెలిపారు. అలాగే విద్యార్థినులు విద్యకు ఎటువంటి అంతరాయం కలగకుండా వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, విద్యార్థుల ఆరోగ్యం మరియు పరిశుభ్రత ఎంతో ముఖ్యమని తెలిపారు.

రీయూజబుల్ మరియు వాషబుల్ క్లాత్ సానిటరీ ప్యాడ్‌ల వినియోగం వల్ల ఆరోగ్య పరిరక్షణతో పాటు పర్యావరణ రక్షణ కూడా సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అనంతరం సుమారు ఆరు లక్షల రూపాయల విలువ చేసే సానిటరీ ప్యాడ్ కిట్స్‌ను జగిత్యాల అర్బన్ మండల పరిధిలోని ప్రభుత్వ మరియు జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుతున్న సుమారు 800 మంది విద్యార్థినులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ అరవ లక్ష్మి, మండల విద్యాధికారి చంద్రకళ, రోటరీ క్లబ్ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు ఏవీఎల్ ఎన్ చారి, రాజు, రోటరీ క్లబ్ సభ్యులు మంచాల కృష్ణ, టీవీ సూర్యం, బొడ్ల జగదీష్, పీఆర్‌టీయూ టీఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు మరియు ప్రధాన కార్యదర్శులు బోయినిపల్లి ఆనంద్ రావు, యాల్ల అమర్నాథ్ రెడ్డి, ప్రముఖ వైద్యులు స్వరూప తదితరులు పాల్గొన్నారు.


