నవగీతం, జగిత్యాల ప్రతినిధి:
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రూపొందించిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమాన్ని జగిత్యాలలో ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ , జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ముఖ్యంగా పట్టణ పరిశుభ్రత అంశంపై చర్చించారు. పట్టణంలో పరిశుభ్రతను మెరుగుపరచి, ప్రజలకు శుభ్రమైన వాతావరణాన్ని అందించేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. అలాగే 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా అభివృద్ధి పనులను వేగవంతం చేసి ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం అధికారులు వార్డుల్లో తిరిగి డ్రైనేజీ వ్యవస్థ, నల్లా నీటి సరఫరా పరిస్థితులను పరిశీలించారు. అలాగే వార్డుల్లో నిర్మాణ దశలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల పనులను కూడా పరిశీలించి, పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) బి. రాజ గౌడ్, జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, మున్సిపల్ చైర్మన్ వాణి, మున్సిపల్ కమిషనర్ స్పందన, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజంగి నందయ్య ,కౌన్సిలర్ లు పంబల సుజాత రాము, బడుగు పద్మ స్వప్న గిరిధర్ మున్సిపల్, రెవెన్యూ అధికారులు,పట్టణ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
