నవగీతం, మేట్ పల్లి టౌన్:
తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు కళాశాల విద్యా కమిషనర్ శ్రీమతి అల్లంరాజు దేవసేన, సంయుక్త సంచాలకులు ప్రొఫెసర్ లు డీ ఎస్ ఆర్ రాజేంద్ర సింగ్, బాల భాస్కర్ ల సూచనల ప్రకారం జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం రోజున ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ప్రారంభమయ్యింది. ఈ సందర్భంగా కళాశాల సిబ్బంది జాతీయ రహదారి సమీపంలో పెరిగిన గడ్డి మొక్కలు, చెత్తాచెదరాన్ని తొలగించారు. కళాశాల ఆవరణను చీపుర్లు, పారలు, గడ్డ పారలు, బుట్టల సహాయంతో శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే వేంకయ్య, వైస్ ప్రిన్సిపాల్ దేవన్న లతో పాటు బోధన, మరియు బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
